Connect with us

Andhra

SIR ను ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా చెయ్యాలి..MPJ

Published

on

విజయవాడ: మేలుకో ఆంధ్రప్రదేశ్ ఆద్వర్యంలో ఎన్నికల సంఘం పనితీరు, SIR అవగాహన సదస్సును విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలులో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరియు ముఖ్య వక్తగా ప్రముఖ సామాజికవేత్త పరకాల ప్రభాకర్, మరో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వర రావులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ముఖ్యవక్త పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. నిష్పక్షపాతంగా ఉండవలసిన ఎన్నికల సంఘం పూర్తిగా ప్రభుత్వానికి లొంగిపోయిందని, గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలే ఇందుకు నిదర్శనం అని అన్నారు.

ఈ కార్యక్రమానికి ఉద్దేశించి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు విద్యలేని వారు, వలసలు వెళ్లిన వారికి SIR వల్ల తమ ఓట్లను కోల్పోయే అవకాశం ఉందని, కాబట్టి ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యంపీజే SIR పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు.

అనంతరం తెలంగాణకు చెందిన ఇర్ఫాన్ ఖాన్ (NCRD), అబ్దుల్ ఖాలిఖ్ (SAFA)లు SIR నుంచి ఓట్లను ఎలా కాపాడుకోవాలో పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో APCR, MPJ, DBF, HRF, SIO, JVV, JIH తదితరు 25కు పైగా ప్రజా సంఘాలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి “మేలుకో ఆంధ్రప్రదేశ్ ‘ కన్వీనర్లు రమేష్ పట్నాయక్, KM అబ్దుల్ సుభాన్, థామస్ తదితరులు కార్యక్రమానికి సంథాన కర్తలుగా వ్యవహారించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.