Connect with us

Andhra

డిప్యూటీ ఇంజనీర్ షేక్ సుభాని సార్ హఠాన్మరణం..

Published

on

మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలో డిప్యూటీ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ సుభాని శనివారం రాత్రి హఠాత్తుగా గుండె పోటుకు గురై మరణించారు. గత సంవత్సరం వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీలో డిప్యూటీ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదీలీలో భాగంగా మాచర్లకు బదిలీ అయి ప్రస్తుతం మాచర్లలో విధులు నిర్వహిస్తూ వినుకొండ ఇంఛార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మార్కాపురం మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తూ.. ప్రమోషన్ వచ్చి డిప్యూటీ ఇంజనీర్ గా 12 సంవత్సరాల వరకు విధులు నిర్వహించారు. మార్కాపురం వాసులకు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని తన సొంత ప్రాంతం అయిన గుంటూరుకు తరలించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.