Connect with us

Andhra

రాష్ట్ర స్థాయిలో కౌశల్ పోటీలో రాణించిన జడ్పీ హెచ్ బాలుర విద్యార్థి హరికిరణ్..

Published

on

అమరావతి: రాష్ట్ర స్ధాయి కౌశల్ పోటీలో నాలుగో స్ధానంలో నిలిచిన ప్రకాశం జిల్లా జట్టు. అందులో బాలుర ఉన్నతపాఠశాల విద్యార్ధి హరికిరణ్.

శాస్త్ర సాంకేతిక రంగంలో ఉజ్వల భవిష్యత్తు తో దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయం వైపు దూసుకు వెళ్లాలని… రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులను, వారికి చక్కటి తర్ఫీదు నిచ్చిన ఉపాధ్యాయులను, కష్ట నష్టాల కోర్చి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తున్నట్టు భారతీయ విజ్ఞాన మండలి, విజ్ఞాన భారతి, ఆప్కాస్ట్, సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సంయుక్తంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఈరోజు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన కౌశల్ 2025 నందు అత్యుత్తమ ప్రతిభ కనబరచి టాప్ 6 టీమ్స్ కు బహుమతుల ప్రదానోత్సవం సందర్బంగా ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు విజ్ఞాన భారతి ఇండియన్ కౌన్సిలర్ కొంపెళ్ల విశ్వం, ఆప్కాస్ట్ మెంబర్ సెక్రటరీ శరత్ కుమార్, డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ శ్రీ ఎం.కైలాష్ రావు, విజ్ఞాన భారతి డైరెక్టర్ డాక్టర్ సుభ్రమణ్యం, జాయింట్ డైరెక్టర్ విభాగం ఆంద్రప్రదేశ్ డాక్టర్ సుమంత్, ఈశ్వర్ రెడ్డి కౌశల్ కన్వీనర్ చేతుల మీదుగా టాప్ ఫోర్ లో నిలిచిన ప్రకాశం జిల్లా జట్టులో మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి తిప్పనబోయిన. వెంకట హరి కిరణ్ ను, అతడికి తోడ్పాటు అందించిన గణిత ఉపాద్యాయులు కాళంరాజు. వేణుగోపాల్ ని ఉప విద్యా శాఖాధికారి మామిళ్లపల్లి శ్రీనివాస రెడ్డి ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్ర శేఖర్ రెడ్డి అభినందించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.