Andhra
ఖాళీ స్థలం కనబడితే కబ్జా.. కబ్జా.. ఇది మార్కాపురంలో తంతు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం నూతన జిల్లాగా కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలపై భూ మాఫియా ఆక్రమణలతో పెట్రేగి పోతున్నారు.
ప్రైవేటు స్థలాల్లో డబుల్ రిజిస్ట్రేషన్, చిన్న సమస్యలు ఉన్న ఆ స్థలంలో జెండా పాతడమే తదుపరి. అలాగే పేదలకు ఇవ్వాల్సిన ప్రభుత్వ స్థలాలు కూడా ఈ భూ కబాసురులు విడవడం లేదు. మార్కాపురం పొలిమేరల్లో చెన్నరాయుని పల్లె వద్ద ఇందిరమ్మ -2 లే అవుట్ లలో కొంతమంది పట్టాలు ఉన్న అక్కడికి పోలేక ఉన్నవారు బేస్ మెంట్ కట్టుకుని విడిచారు. వాటిలో కొన్నింటిని మరియు ఖాళీగా ఉన్న భూములపై భూ కబ్జా దారులు కన్ను పడిందే ఆలస్యం వాటిలో కొత్తగా బేస్ మటంలను కట్టి ఒకటి లక్ష, లక్షన్నరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ తంతు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం గమనార్హం. మీడియాలో వచ్చేసరికి మండలం తహశీల్దార్ చిరంజీవి, హౌసింగ్ అధికారులు కలిసి పోలీసుల సహకారంతో కొత్తగా కొట్టిన బేస్ మటంలను నేలకూల్చారు.
ఈ సందర్భంగా ఎమ్మార్వో చిరంజీవి ప్రభుత్వ స్థలాల్లో భూ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటి వెనుక అధికార పార్టీ నేతలు ఉన్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.
![]()
