Andhra
దర్శిని మార్కాపురం జిల్లాలో కలపాలని ఉద్యమం..
మార్కాపురం: మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గాన్ని కలపాలనే డిమాండ్ పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్ ముందు విద్యావంతులు, మేధావుల వేదిక ఆధ్వర్యంలో సంతకాల ఉద్యమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేదిక ఓరుగంటి మల్లిక్ మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు చాలా రాజకీయ, ప్రజా, వ్యాపార, కార్మిక, కర్షక వర్గాల వారు కృషి ఫలితంగా నూతన జిల్లా మార్కాపురం వారి ఫలితంగా నూతన జిల్లాగా ఏర్పాటు కానుందని, అందుకు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నామని, కానీ మార్కాపురం జిల్లా నుంచి దర్శిని వేరు చేయడం బాధాకరమన్నారు. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కోర్టు కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలపాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రజాసంఘాలు పాల్గొన్నారు.
![]()
