Connect with us

Andhra

నేడు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కు 204 అర్జీలు..

Published

on

మార్కాపురం: మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి మొత్తం 204 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ సంబంధించిన 126, ఇతర సమస్యలపై 78 అర్జీలు వచ్చాయని వారు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకే సమస్యపై ప్రజలు పదేపదే వస్తున్నారని ఈ ధోరణి అరికట్టాలంటే భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ఒక్కటే మార్గం అన్నారు. ఇకనుంచి ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు ప్రభాకర్, శివరామిరెడ్డి, మైనింగ్ శాఖ జిల్లా అధికారి రవివర్మ, ఐసిడిఎస్ ఇంచార్జ్ పీడీ పద్మావతి, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి రాంబాబు, జిల్లా పంచాయతీ రాజ్ ఇన్చార్జి అధికారి బాలు నాయక్ బాలు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.