Andhra
అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ముందుకు…జిల్లా కలెక్టర్
మార్కాపురం: ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతామని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అన్నారు. సోమవారం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలోని బి కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలను మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపడుతున్న ఇటువంటి జాబ్ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకొని రాణించాలన్నారు. నిరుద్యోగులకు చక్కని వేదికలుగా ఈ జాబ్ మేళాలు ఉపయోగపడుతున్నాయని వివరించారు. జాబ్ మేళాలకు విశేష స్పందన రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మాదిరిగా నిరుద్యోగులను మోసం చేయకుండా ఒక లక్ష్యం ప్రకారం ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పిస్తున్నామని తెలిపారు. సాఫ్ట్ వేర్ కంపెనీలతోపాటు వివిధ ఎంఎన్ సీ కంపెనీలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే కేక్ కటింగ్ చేసి ఆనందం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కంచిబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
![]()
