Andhra
నెల్లూరులో ఆకతాయిల దారుణం..
ఏపి: నెల్లూరు నగరంలో మద్యం మత్తులో ఉన్న యువకులు ప్రైవేటు సిటీ బస్సును వెంబడించి డ్రైవర్, కండక్టర్‌పై బ్లేడ్‌లతో దాడిచేసి పరారయ్యారు.
ఎస్ఏస్ సిటీ బస్సు సర్వీసులో నెల్లూరు రూరల్ మండలం మహాత్మగాంధీ నగర్‌కు చెందిన మన్సూర్ డ్రైవర్‌గా, ఇందుకూరుపేట మండలం గంగపట్నంకు చెందిన సలాం కండక్టర్‌గా చేస్తున్నారు. సిటీ బస్సు గాంధీబొమ్మ వైపు నుంచి బోసుబొమ్మ వైపు బయలుదేరింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు రోడ్డుపై బైక్‌లు నిలిపి తిష్టవేశారు.
బైక్ లను అడ్డంతీయాలని డ్రైవర్ హారన్ కొట్టినా పట్టించుకోకపోగా దుర్భాషలాట జరిగింది. దీంతో డ్రైవర్ బస్సుదిగి యువకులతో వద్దకు వెళ్ళి వాగ్వాదం జరిగి బస్సు వెళ్లినట్లు, అనంతరం మద్యం మత్తులో ఉన్న యువకులు మరో బైక్‌పై బస్సును వెంబడించి, బస్సులోకి వెళ్లి డ్రైవర్, కండక్టర్లపై బ్లేడ్లతో విచక్షణారహితంగా దాడిచేసి పరారయ్యారు. నగరానికి చెందిన మదన్ వారి స్నేహితులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని సమాచారం.
![]()
