Andhra
జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్
Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు. అదేవిధంగా వివిధ కేటగిరీలలో జె.సిహెచ్.వర్షిత్ ఆలిండియా 5వ ర్యాంకు, డి.పవన్ ఆలిండియా 6వ ర్యాంకు, టి.దుర్గా సుప్రభాత్ ఆలిండియా 11వ ర్యాంకు, ఆర్.బాలానాయక్ ఆలిండియా 24వ ర్యాంకు, కె. రామకృష్ణారెడ్డి ఆలిండియా 62వ ర్యాంకు, సిహెచ్. ప్రణయ్ ఆలిండియా 83వ ర్యాంకు, వై. యశస్వి ఆలిండియా 99వ ర్యాంకు, ఎం.బాలసాయిరామ్ ఆలిండియా 123వ ర్యాంకు, కె. కేశవకుమార్ సాయికృష్ణ ఆలిండియా 135వ ర్యాంకు, నూర్ బాషా హఫీజ్ ఆలిండియా 140వ ర్యాంకు వంటి 150లోపు 10 అత్యుత్తమ ర్యాంకులతో పాటు ఆల్ ఇండియా 200లోపు 21 ర్యాంకులు, 500లోపు 65 ర్యాంకులు, 1000లోపు 87 ర్యాంకులు కైవసం చేసుకొని 74.86% సక్సెస్ రేట్తో తమ సత్తా చాటారన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గర్వకారణమైన -జయాన్ని అందజేసిన దుర్గా సుప్రభాత్కు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహాకాన్ని అందజేశారు. ఇదే స్ఫూర్తితో = సంవత్సరం మే నెలలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్లో కూడా తమ విద్యార్థులు ఘన విజయాలు “ధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘన విజయాలకు స్కూల్ స్థాయి నుండే మేమందించే భాష్యం ఐఐటి అండేషన్ కరిక్యులమే కారణమన్నారు. ఈ విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, వ్యాపకులకు ఛైర్మన్ భాష్యం రామకృష్ణ, భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, జింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్రామ్, ఐఐటి ప్రోగ్రామర్ ఎం. ఆనంద్కుమార్లు అభినందనలు తెలిపారు.
![]()
