Connect with us

Andhra

అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా సెమినార్..

Published

on

మార్కాపురం: నేడు అగ్నిమాపక వారోత్సవల ముగింపు కార్యక్రమంలో భాగంగా మార్కాపురం అగ్నిమాపక కేంద్రంలో సెమినార్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా మార్కాపురం ఎక్సైజ్ సూపరిండెంట్ గౌరవనీయులు M. రాధాకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కాపురంలోని NCC, NSS, ఓం సాయి వికాస్ విద్యానికేతన్ విద్యార్థుల హాజరయ్యారు. ఈ సెమినార్ ప్రోగ్రాం నందు బేసిక్ ఫైర్ ఫైటింగ్ గురించి అవగాహన కల్పించారు. అదేవిధంగా ఫైర్ Extinguishers మరియు ఇతర అగ్నిమాపక సాధనాల గురించి వాటిని ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేశారు.

అదేవిధంగా వేసవికాలం నందు విద్యార్థిని విద్యార్థులు మరియు చిన్న పిల్లలు గ్రామాల్లో ఈతకు వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలియజేయారు. తదనంతరం ముఖ్యఅతిథి ఎం.రాధాకృష్ణ చేతుల మీదుగా ఇటీవల నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నందు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ఇచ్చారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.