Connect with us

Andhra

సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన ప్రకాశం జిల్లా పోలీసులు۔۔

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా కనిగిరి గ్రామానికి చెందిన 26’సంవత్సరాల గల ఒక వ్యక్తి కుటుంబ సమస్యల కారణంగా ఈరోజు ఉదయం 9 గంటలకు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గరలో గల ఫ్లై ఓవర్ పైనుండి కిందకు దూకుటకు ప్రయత్నించగా, సమాచారం మేరకు మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.సుబ్బారావు మరియు మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అంకమ్మ రావు తన సిబ్బందితో ఫ్లైఓవర్ వద్దకు చేరుకొని అతని ప్రాణాలను కాపాడారు. అనంతరం అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

వెంటనే స్పందించి సదరు వ్యక్తి యొక్క ప్రాణాలను చాకచక్యంతో కాపాడిన పోలీసులకు అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. విధి నిర్వహణలో మంచి పనితీరు కనబర్చిన మార్కాపురం ఇన్స్పెక్టర్ సుబ్బారావు, మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్మరావు మరియు వారి సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అభినందించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.