Andhra
రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న మున్సిపల్ ఉద్యోగి టపావలి۔۔
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పురపాలక సంఘం నందు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేయుచున్న షేక్ టపా ఖాదర్ వలి ఈరోజు మార్కాపురం పట్టణంలోని కందుల ఓబుల్ రెడ్డి ఆసుపత్రి నందు ఒక గర్భిణీ మహిళకు కు అత్యవసరంగా “A” పాజిటివ్ రక్తం అవసరం కాగా రక్త దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
పేషెంట్ బంధువులు దాతల కోసం వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయగా వెంటనే స్పందించిన మున్సిపల్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ టపావలి సదరు ఆసుపత్రి వద్దకు వెళ్లి మహిళకు కావలసిన “A” పాజిటివ్ రక్తాన్ని ఇచ్చారు. అయినవాళ్లే మనకెందుకులే అని దూరంగా ఉండే ఈ రోజుల్లో నిమిషాల వ్యవధిలో స్పందించి ఇలా రక్తదానం చేయడం కొంతమందికే సాధ్యమని వారి బంధువులు అతనికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విషయంపై టపావలి మాట్లాడుతూ.. ఇప్పటికి తన స్నేహితులకు ఆఫీసు సిబ్బందికి మరియు ఇతరులకు ఎనిమిది సార్లు రక్తదానం చేశానని, అలాగే ఎంత ఎక్కువ సార్లు రక్తదానం చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారని అలాగే రక్తదానం చేయుటకు ముఖ్యంగా యువకులు ముందుకు రావాలని కోరారు.
![]()
