Connect with us

Andhra

ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ గా షేక్ మహబూబ్ వలి నియామకం..

Published

on

విజయవాడ: ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెం ట్ నూతన చైర్మన్ గా మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తర్లపాడు మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఎక్స్ సర్వీస్ మెన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెం ట్ పూర్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన షేక్ మహబూబ్ వలిని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నియామక పత్రాన్ని విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా సమక్షంలో అందజేశారు.

ఈ సందర్భంగా షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. తనమీద నమ్మకంతో ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పినం దుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదాకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని మహబూబ్ వలి ఈ సందర్భంగా తెలిపారు. మహబూబ్ వలీకు చైర్మన్ గా పదోన్నతి పొందినందుకు పార్టీ కేడర్, సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అభినందనలు తెలియజేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.