Connect with us

Andhra

జడ్పీ బాలుర హైస్కూల్ లో ఘనంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం 3.O…

Published

on

మార్కాపురం: జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రకాశం జిల్లా మార్కాపురం నందు ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డి మరియు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తంగిరాల నాగ జగన్నాథ్ విశిష్ట అతిథులుగా మెగా పి.టి.ఎం 3.0 ఘనంగా నిర్వహించారు..

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి గల అంకిత భావం, దానికి అనుగుణంగా వారి అభివృద్ధికి తీసుకునే నిర్ణయాల గురించి తెలియజేస్తూ, విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు.

సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు నైతిక విలువలు కలిగిన విద్యను అభ్యసించి, తద్వారా ఉన్నతంగా చదివి తల్లిదండ్రులకు,పాఠశాలకు, ఉపాధ్యాయులకి మంచి పేరు తీసుకురావాలని అభిలాషించారు. తల్లిదండ్రులు తమ విద్యార్థుల పట్ల శ్రద్ధ తీసుకొని పాఠశాలకు ప్రతిరోజు హాజరయ్యేలా వారిపై ప్రత్యేక శ్రద్ధ కనిపరిచితే, వారిని చక్కగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయుడి పై ఉంటుందని ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులుగా తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, తల్లిదండ్రులు సహకరించాలని, విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి, వారి అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి ఇలాంటి సమావేశాల ఆవశ్యకత ఎంతో ఉందని ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాందాస్ నాయక్, టిడిపి నాయకులు, పాఠశాల కమిటీ చైర్మన్ మంకు ఏడు కొండలు, వైస్ చైర్మన్ యస్.కె ముంతాజ్ బేగ్, కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాఠశాల యన్.సి.సి మరియు స్కౌట్స్ విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.