Andhra
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఐదుగురు విద్యార్థులు దుర్మరణం..
గుంటూరు: పల్నాడు జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాదెండ్ల మండలం గణపవరం వద్ద బైపాస్ రోడ్డుపై వెళ్తున్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అందరూ అయ్యప్పమాలధారణలో ఉన్నారు. మృతులు విజ్ఞాన్ కాలేజీ విద్యార్థులు. మృతుల్లో నలుగురిని శ్రీకాంత్, వాసు, రామిరెడ్డి, మహేశ్‌గా పేర్కొన్నారు. ఓవర్ స్పీడ్ కారణమని తెలుస్తోంది.
పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదంపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఉన్న విద్యార్థులు దుర్మరణం పాలవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
![]()
