Andhra
మార్కాపురం: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా సందర్భంగా మండల తీగల్ సర్పిసెస్ చైర్మన్ శ్రీమతి M. శుభవాణి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్యానెల్ న్యాయవాది మొగల్ అన్వర్ బేగ్ మరియు న్యాయవాది కె. రామయ్యలు పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా వికలాంగులు సంఘంలో సమాన హక్కులు, సమాన గౌరవం మరియు సమాన అవకాశాలు పొందాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా మొగల్ అన్పర్ బేగ్ మాట్లుడుతూ.. వికలాంగత అనేది బలహీనత కాదు, సరైన అవకాశం ఇస్తే వారు కూడ ప్రతిభలో ఎంతో ముందుకు వెళ్ళగలరు అని చెప్పారు. మరియు వారికి ఏదైనా న్యాయ సహాయం కావాలంటే మండల లీగల్ సర్పిస్ అధారిటి ద్వారా ఏర్పాటుచేయడం జరుగుతుందని చెప్పారు.
![]()
