Connect with us

Andhra

అధికారుల నిర్లక్ష్యానికి మున్సిపల్ అదాయానికి గండి..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపాలిటీకి రావలసిన ఆదాయం అధికారుల నిర్లక్ష్యానికి గండి పడుతుంది. సంవత్సరం క్రితం కంభం సెంటర్ లో బంకులను తొలగించిప్పుడు లక్షల రూపాయల ఆదాయానికి గండి పడింది. ఇప్పటికే పట్టణంలోని చాలా మున్సిపల్ స్థలాలు ఆక్రమణలకు గురైనాయి‌. ముఖ్యంగా బావులు, వాటర్ ట్యాంకులను అయితే స్వయంగా గత మున్సిపల్ పాలకులే అప్పనంగా అప్పజెప్పారనే అపవాదు ఉంది.

ప్రస్తుతం గడియార స్థంభం ఎదురుగా చెన్నకేశవ స్వామి, అయ్యప్ప స్వామి గుళ్లకు పడమర వైపు గత 50 సంవత్సరాల క్రితం ఉన్న మున్సిపల్ కమర్షియల్ రూములను కాలం తీరినందున తీసేసి, మళ్లి పూర్తి స్థాయి రూములను కట్టి ఇస్తామని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధి చెప్పియున్నారు. సంవత్సరం కావస్తున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంతో మున్సిపాలిటీకి రావలసిన లక్షల ఆదాయం రాకుండా పోతుందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కమర్షియల్ రూములను కట్టించి మున్సిపల్ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారని ప్రజలు భావిస్తున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.