Andhra
మార్కాపురం MVI స్పెషల్ డ్రైవ్ – 21 బస్సుల తనిఖీ.. నియమాలు పాటించాలని హెచ్చరిక
మార్కాపురం: ఆంధ్రప్రదేశ్ రవాణా కమిషనర్ మరియు ప్రకాశం జిల్లా ఉప రవాణా శాఖ అధికారి ఆర్ సుశీల ఆదేశాల మేరకు మార్కాపురం డివిజన్ పరిధిలో ఉన్న స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎ మాధవరావు. ఈ డ్రైవ్ లో భాగంగా మార్కాపురంలోనీ 21 స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ తనిఖీలు భాగంగా 3స్కూల్ బస్సులకి FDSS లేని కారణంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏ మాధవరావు వారికి నోటిష్ ఇచ్చారు. ఆ నోటిసులో 10 రోజుల గడువు ఇచ్చి, ఆ తర్వాత FDSS లేని ఆ బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని, అలాగే బస్సులకి తప్పనిసరిగా ఉండవలసిన మరియు పాటించవలసిన నియమాలను పాటించకపోతే బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
![]()
