Andhra
అంబేద్కర్ ను అవమానించిన రామాంజనేయ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. దళిత సంఘాలు
మార్కాపురం: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహ శంకుస్థాపన విషయంలో ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామ మాజీ సర్పంచి టిడిపి నాయకుడు జవ్వాజి రామాంజనేయరెడ్డిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి మార్కాపురం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.
అనంతరం దళిత నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించగా అది తెలుసుకొన్న గ్రామ మాజీ టిడిపి సర్పంచి జవాజి రామాంజనేయరెడ్డి అంబేద్కర్ శిలాఫలకం చుట్టూ కంచెను ఏర్పాటు చేసి దళితుల ఆత్మగౌరవాన్ని మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించారని, సదరు టిడిపి మాజీ సర్పంచ్ జవ్వాజీ రామాంజనేయరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అంబేద్కర్ విగ్రహానికి స్థలాన్ని కేటాయించాలని దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రజాసంఘాల నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతగుంట్ల బాబు, విసికె మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి నూతలపాటి రాజు, సమాఖ్య డివిజన్ అధ్యక్షులు అమ్ముడుపూడి రామాంజనేయులు, సోషల్ యాక్టివిస్ట్ కొటారు ప్రభుదాసు, అంబటిపూడి దాసు, ఇండ్ల ఇర్మియ, దాసరి సునీల్ తదితరులు పాల్గొన్నారు.
![]()
