Andhra
బోరు పనిచేయదు..అధికారులు, ప్రజా ప్రతినిధి పట్టించుకోరు..4వ వార్డు ప్రజల ఇక్కట్లు
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 4వ వార్డులో గత రెండు రోజులుగా బోరు పనిచేయక పోవడంతో నీరులేక వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బోరుకు ఆపరేటర్ ఎవరో తెలియని పరిస్థితి. ఈ బోర్డును స్ధానికులే ఆపరేట్ చేసుకుని స్థానికులే ఆపే పరిస్థితి ఏర్పడింది. పైపులు లీకేజీతో నీరు వృధాగా పోతున్న పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బోర్ మరమ్మతులు చేసి స్థానికులకు మంచి నీళ్ళు వచ్చేలా చేసి, పైపు లీకేజిలను అరికట్టాలని, బోర్ ఆపరేటర్ పి మార్చారని స్ధానికులు కోరుతున్నారు. సంభందించిన మున్సిపల్ అధికారులు ఫోన్లు కూడా ఎత్తుకోవడం గమనార్హం. ఇక్కడి మున్సిపల్ కౌన్సిలర్, అధికారి పార్టీ ఇంఛార్జిలు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![]()
