Connect with us

Andhra

12వ బ్లాక్ ఇంఛార్జి ఉస్మాన్ ఆద్వర్యంలో ఘనంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం..

Published

on

మార్కాపురం: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం మార్కాపురం పట్టణంలోని 12 బ్లాక్ లో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 12వ బ్లాక్ ఇంఛార్జి షేక్ ఉస్మాన్ మరియు షేక్ మహబూబ్ బాషా ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మార్కాపురం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొఘల్ షంషీర్ అలీబేగ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబుని గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గుర్తించి మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని మానుకొని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.