Connect with us

Andhra

ఏపి పై ఉరుముతున్న దిత్వా తుఫాన్.. ఈ జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్

Published

on

బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వ తుఫాను.. భారత్ వైపు వేగంగా కదులుతోంది. గడచిన 6 గంటల్లో 5 వేగంతో తుఫాను గమనం సాగుతోంది. కారైకల్ కు తూర్పున 80 కి.మీ., వేదరన్నియంకు తూర్పున 100 కి.మీ., చెన్నైకి 250, పుదుచ్చేరికి 160 దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తుఫాను మరికొద్ది గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మరింత చేరుకోనుంది. తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తోంది. కృష్ణపట్నం పోర్టుకు మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడింది. మిగిలిన అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అటు తుఫాన్ ప్రభావంతో మూడు రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు పడతాయి వాతావరణ శాఖ.

ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఇక సోమవారం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఈస్ట్ గోదావరి, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.