Andhra
నేడు 12వ బ్లాక్ లో ఉస్మాన్ ఆద్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం..
మార్కాపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 12వ బ్లాక్ విద్యానగర్లో 30- 11- 2025 ఆదివారం ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు మాజీ శాసనసభ్యులు మార్కాపురం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు విచ్చేయుచున్నారని కావున ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు మరియు వైయస్సార్ అభిమానులు, వివిధ హోదాలలో ఉన్న వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్సార్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షులు మరియు 12వ బ్లాక్ ఇంచార్జ్ షేక్ ముహమ్మద్ ఉస్మాన్ కోరారు.
![]()
