Andhra
ఇస్లాం ధర్మం ఉగ్రవాదాన్ని నేర్పదు..అహ్లె హదీస్ ఏపి అధ్యక్షులు
ఏలూరు: ఇస్లాం ధర్మం ఉగ్రవాదం నేర్పదని జమ్ యియ్యత్ అహ్లెహదీస్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు షేక్ ఫజులుర్రహ్మాన్ ఖురైషి ఉమరి అన్నారు.
ఏపి రాష్ట్ర జమయియ్యత్ అహ్లెహదీస్ కార్యవర్గ సభ్యుల త్రైమాసిక సమావేశం నేడు ఏలూరు పెన్షన్ లైన్ మదిని మస్జిద్ లో జరిగింది. దీనికి అధ్యక్ష వహించిన ఫజులుర్రహ్మాన్ ఉమరి, కమీటీ సభ్యులు ఈనెల 10వ తేదీన ఎర్రకోట, సమీపములో ఉగ్రదాడి జరగి అందులో 9మంది ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దుర్ఘటన దిగ్భ్రాంతికరమైన విషయమని చెబుతూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. ఇస్లాం ధర్మములో ఇటువంటి వికృత చేష్టలు లేవని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదులకు ధర్మమూ, మతమూ అంటూ వుండదని కనుక అలాంటి కరనముగా శిక్షించాలని అన్నారు.
అలాగే ఈనెల 17 వతేదిన పవిత్ర నగరమైన మదీనా దగ్గర దుర్ఘటన జరగడం, అందులో పవిత్ర “ఉమ్రా” కు వెళ్ళిన అనేక మంది ప్రతేకించి ఒకే కుటుంబానికి చెందిన 18 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది ఎంతో బాధాకరమైన విషయమని, ఇది మనసుని కలచి వేసిందని, పుణ్య ప్రార్ధనలకోసం వెళ్ళి ఇటువంటి ప్రమాదానికి గురి కావటం చాలా బాధాకరమైన విషయమని, అల్లాహ్ వీరి పాపాలను క్షమించి స్వర్గములో స్థానం కల్పించాలని కోరారు.
అలాగే ఈనెల 30వ తేదీన ఒక రోజు జరగబోయే “సిరాతె ముస్తఖీమ్” కన్వెన్షన్ గురించి ప్రస్తావిస్తూ ఇందులో పాల్గొనే వారికి అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని, ఏర్పాట్లు అన్ని సక్రమంగా చూడాలని సభ్యులతో కోరారు. ఈ కన్వెన్షన్ ద్వారా ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం శందేశాలు నైతిక విధానాలు అందరికి తెలియచేసెందుకు కృషి చేస్తున్నామని తెలియపర్చారు.
అదే విధముగా ప్రభుత్వం జారీ చేసిన అదేశాలను దృష్టిలో పెట్టుకొని గడువు లోపల అనగా 05-12-2025వ తేది లోపల “ఉమ్మీద్ పోర్టల్” లో తమ తమ మస్జిద్ కి సంబంధించిన వక్స్ అస్తులను తప్పకుండా నమోదు చేసుకోవాలని, భారత దేశములో ఐక్యతను ప్రదర్శిస్తూ, ప్రజలతో కలసి మెలసి ఉండాలని కోరారు.
![]()
