Andhra
మస్జిద్ ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని తహశీల్దార్ ను వినతిపత్రం ఇచ్చిన ముత్తవల్లీలు..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ముత్తవల్లిల కమిటీ ఆధ్వర్యంలో మార్కాపురం తహశీల్దార్ ను కలిసిన ముత్తవల్లీలు.
ఈ సందర్భంగా పట్టణంలోనీ ఈద్గాలు, ఖబరస్తాన్లు, మస్జిద్ లకు సంబంధించిన ధృవీకరణ పత్రాల కొరకు తహశీల్దార్ చిరంజీవి మకు వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ ఎమెండ్ మెంట్ తెచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కొన్నింటిపై ఆపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉమ్మిద్ పోర్టల్ తీసుకుని రావడం జరగడం, అందులో డిసెంబర్ 5వ తేదిలోగా సంభందిత వక్ఫ్ ఆస్తులను నమోదు చేయాలని కోరుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉమ్మిద్ పోర్టల్ లో నమోదు కొరకు సమయం తక్కువగా ఉన్నందున త్వరగా ధృవీకరణ పత్రాలను ఇవ్వవలసిందిగా ముత్తవల్లీలు తహశీల్దార్ ను కోరారు. ఈ విషయం గురించి ఇప్పటికే ముత్తవల్లీలు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కలవడం, ఆయన తహశీల్దార్ కు త్వరగా చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వైస్ చైర్మన్ షేక్ షెక్షావలి, పట్టణ అధ్యక్షుడు పి ఇబ్రహీం ఖాన్, సీనియర్ నాయకులు పి గులాబ్ ఖాన్, సయ్యద్ గఫ్ఫార్, ముత్తవల్లీల గౌరవ అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, అధ్యక్షులు ఎమ్ సబ్దర్ అలీబేగ్, ప్రధాన కార్యదర్శి షేక్ కరీముల్లా మరియు పట్టణ ముత్తవల్లీలు పాల్గొన్నారు.
![]()
