Connect with us

Andhra

ఆదాయ వనరులు లేని మార్కాపురం జిల్లాను ఇస్తారా.. వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్

Published

on

మార్కాపురం: ఎలాంటి ఆదాయ వనరులులేని మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేయడం శోచనీయమని వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ గౌస్ మోహిద్దీన్ శుక్రవారం నాడు ఒక ప్రకటన లో విమర్శించారు. ఈ సందర్బంగా వైసీపీ నేత సయ్యద్ గౌస్ మోహిద్దీన్ మాట్లాడుతూ.. కొత్త జిల్లా ఏర్పాటుతో వాటి పరిధిలోని ప్రాంతాలంతా పురోగతి సాధించేలా ఉండాలని ఆయన అన్నారు. ఇందుకోసం మంచి ఆదియమిచ్చే ప్రాంతాలను కూడా కొత్త జిల్లాలలో కలపాలని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కొత్త జిల్లా మార్కాపురంలో శ్రీశైలంను కలకపోగా దర్శి, దొనకొండను కూడా కలపకుండా మరింత అన్యాయం చేశారని ఆయన విమర్శించారు .కొత్త జిల్లా వల్ల కొన్ని వర్గాలకే మేలు జరిగేలా, కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్థిక వనరులను అందించే ప్రాంతాలను కలపకుండా మార్కాపురం జిల్లాను కూటమి సర్కార్ ఏర్పాటు చేయడం మాని జిల్లాకు నష్టం జరగుతుందని, కనీసం కురిచేడు దొనకొండ ప్రాంతానైనా మార్కాపురం జిల్లాలో కలపాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఈ జిల్లా వాసుల పట్ల కూటమి సర్కార్ వివక్ష చూపినట్లవుతుందని ఆయన విమర్శించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.