Andhra
MPJ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం..
ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో మూవ్ మెంట్ ఫర్ పీస్ & జస్టిస్ ఆధ్వర్యంలో నవంబర్ 26 న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొర్రపాడు రోడ్డులోని SKSC డిగ్రీ కాలేజీలో భారత రాజ్యాంగ పరిరక్షణ – మన బాధ్యత అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం, రాయలసీమ ఇన్చార్జి అయూబ్ ఖాన్, సీనియర్ న్యాయవాది దాదా హయాత్, విరసం మహిళ నాయకురాలు వరలక్ష్మి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగం లోని ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, సమానత్వం, స్వేచ్ఛ స్వాతంత్ర్యము, దోపిడిని నివారించే, మత స్వాతంత్ర్యం, విద్యా, సాంస్కృతిక, రాజ్యాంగ పరిరక్షణ హక్కులు గురించి వివరించారు. ప్రభుత్వాలు చట్టసభలలో ఏ విధంగా ఉండాలి న్యాయమూర్తులు, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాజ్యాంగానికి లోబడి ఏ విధంగా ఉండాలో వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని అన్నారు. కాలేజ్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ రెడ్డి చివర్లో సభలో అందరితోనూ రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీజే ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్, కోశాధికారి ఇస్మాయిల్, సభ్యులు ముక్తార్, ఫర్హాన్ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
![]()
