Connect with us

Andhra

సమిష్టి ఉద్యమ ఫలితమే మార్కాపురం జిల్లా ఏర్పాటు – జిల్లా సాధన సమితి..

Published

on

మార్కాపురం: మార్కాపురం నూతన జిల్లా ఏర్పాటు ప్రకటన మార్కాపురం జిల్లా సాధన సమితి సమిష్టి ఉద్యమ ఫలితమేనని మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్ షేక్ సైదా తెలిపారు. బుధవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సాధన సమితి నాయకులు సిపిఎం పట్టణ కార్యదర్శి డీ.కే.ఎం రఫీ అధ్యక్షతన మార్కాపురం జిల్లా ఏర్పాటుకు కారణమైన మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో విజయోత్సవ సమావేశం నిర్వహించారు.

మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్స్ పంచుతూ, టపాసులు కాల్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేశారు. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లా సాదన సమితి కన్వీనర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, కో కన్వీనర్లు సిపిఐ సీనియర్ నాయకులు అందే నాసరయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దగ్గుబాటి సోమయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్, ఎం.పి.జె రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, సిపిఐ నాయకులు షేక్ ఖాసీంలు మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లా ఏర్పాటు ప్రకటన మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలోని సుదీర్ఘ ఉద్యమ ఫలితంగానే ప్రభుత్వం ద్వారా ఈ ప్రకటన వెలువడిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రాంత ప్రజల కలలు సాకారం అయ్యాయని, ఈ ప్రాంత ప్రజల కలల సహకారం నేటికి ఇంకా పూర్తి కాలేదని, గిద్దలూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, దొనకొండ, కురిచేడు మండలాలు ఒంగోలుకు సూదూరం కావడంతో దర్శి నియోజకవర్గాన్ని కూడా మార్కాపురం నూతన జిల్లాలో బాగం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం ప్రాంతాన్ని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని కోరారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో 65 రోజులు పాటు సుదీర్ఘ ఉద్యమంలో పాలుపంచుకున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక, కర్షక, రైతు, వివిధ కుల సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళ ఉద్యోగ సంఘాల అందరికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నాయకులు మాట్లాడుతూ.. ఏ ఒక్కరి నాయకత్వంలో జరిగిన ఉద్యమం కాదని ఇది సమిష్టి ఉద్యమమేనని.. సమిష్టి విజయమేనని తెలిపారు. మార్కాపురం జిల్లా ఏర్పాటులో జిల్లా అభివృద్ధికి కావలసిన నిధులు, సౌకర్యాలు, ఇంకా జరగాల్సిన అంశాలపై కూలంకుశంగా మాట్లాడుకొని తదుపరి కార్యాచరణ చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఐ (ఎం), కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, యంపీజే నాయకులు కార్మిక, కర్షక, రైతు, విద్యార్థి, యువజన, రిటైర్మెంట్ ఉద్యోగులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.