Andhra
బిజేపి నాయకులు మద్దెల లక్ష్మి ఆద్వర్యంలో సీయంకు పాలాభిషేకం..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం నాలుగో వార్డులో బిజెపి మహిళా మోర్చా జిల్లా కార్యదర్శి మద్దెల లక్ష్మీదేవి ఆధ్వర్యంలో మహిళలు మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పూర్తిగా వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ సీయం చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లా ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి, రవణమ్మ, పుల్లమ్మ, అన్నపూర్ణ, రాములమ్మ, కుమారి, అంజమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.
![]()
