Andhra
69వ స్కూల్ స్పోర్ట్స్ కరాటే చాంపియన్ పోటీల్లో సత్తా చాటిన MS స్పోర్ట్స్ కరాటే స్కూల్ విద్యార్థులు..
69వ స్కూల్ గేమ్స్ కరాటే చాంపియన్షిప్ పోటీలలో అండర్ 14 బాలురు & బాలికల 17 & 19 బాలుర & బాలికల విభాగంలో సత్తా చాటిన MS కరాటే స్కూల్ విద్యార్థులు తమ సత్తాను చాటారు..
SKVT. డిగ్రీ కళాశాల, అంబేద్కర్ భవన్, తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో జరిగిన తేదీ నవంబర్ 23 , 24, 25, 26 తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో మార్కాపురం పట్టణానికి చెందిన MS స్పోర్ట్స్ కరాటే స్కూల్ విద్యార్థులు. ప్రకాశం జిల్లా తరపున 1) SK జోయాసిద్ధికి అండర్ 14 సం” -50 కేజీల బాలికల విభాగంలో గోల్డ్ మెడల్, 2) SK హుస్సేన్ భాష అండర్ 17 ఇయర్స్ బాలుర-66 కేజీలు విభాగంలో గోల్డ్ మెడల్, 3) జవాంగల సాయి భార్గవ్ 17 సం” -50 కేజీలు, బాయ్స్ విభాగంలో సిల్వర్ మెడల్ 4) sk MD షాకీర్ భాష అండర్ 17 సం + 82 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, 5) SK రిజ్వాన్ అండర్ 14 ఇయర్స్ బాలికల విభాగంలో -56 కేజీలు సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటారు.
గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థులు ఇద్దరు జనవరిలో ఇండోర్ మరియు పూణేలో జరిగే జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ కరాటే పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున అర్హత సాధించారని ఎమ్మెస్ స్పోర్ట్స్ కరాటే స్కూల్ చీఫ్ ఎగ్జామినర్ మారం రెడ్డి శ్రీనివాసరెడ్డి బ్లాక్ బెల్ట్ 7th డన్ & తోట ప్రసాద్ సీనియర్ ఇన్స్పెక్టర్ బ్లాక్ బెల్ట్ 6th డన్ తెలియజేశారు.
![]()
