Connect with us

Andhra

రాష్ట్ర స్థాయి జిమ్నాస్టిక్స్ పోటీలకు మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థుల ఎంపిక..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఆనంద్ మినిస్టేడియం నందు 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం నుండి జిమ్నాస్టిక్స్ అండర్ 14 అండర్ 17 లో సత్తా చాటిన మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు..

స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు షేక్. రహిమాన్, షేక్ నజీర్, షేక్ ఆరిఫ్, జి.గణేష్ లు అండర్ 14 జిల్లా జట్టుకు, యం.బాలకాశయ్య, పి.ప్రియాంత్, జి.కృష్ణ వంశి, షేక్ ముస్తక్ వలి అండర్ 17 విభాగంలో జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు.

వీరు ఈనెల 28న కాకినాడ లోని డి.యస్. ఎ.స్టేడియంలో జరగబోవు రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ బాలుర విభాగంలో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. వీరికి శిక్షణ ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు డి.శ్యామల దేవి, పి.దామోదర్ రెడ్డి మరియు కె. ఓబులేసు లను ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది అభినందించారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.