Connect with us

Andhra

భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పది.. MPJ

Published

on

నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ మార్కాపురం శాఖ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంపీజే ఏపి రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా గర్వించదగ్గ రాజ్యాంగం ఒక్క భారతదేశంలోనే ఉందని, ఎన్నో భాషలు, సాంస్కృతిక, మతాలను దృష్టిలో ఉంచుకుని, రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్ధెనిమిది రోజుల పాటు 199 రాజ్యాంగ నిపుణుల కమిటీ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చైర్మన్ అధ్యక్షుతన లిఖిత పూర్వకంగా తయారైందని, ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న సభలో ఆమోదించినప్పటికీ, 1950 నవంబర్ 26న ప్రారంభమైందని, ఈ రోజుని నేషనల్ లా డేగా చేసుకునే వారమని, 1975 నుంచి రాజ్యంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని.. దీన్ని MPJ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశాఖ ఆద్వర్యంలో నవంబర్ 20 నుంచి 30 వరకు పది రోజుల పాటు రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించెందుకు వ్యాసరచన, వక్రృత్వ, గెట్ టు గెదర్ లాంటి వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో యంపీజే మార్కాపురం పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి, ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలి, నాయకులు షేక్ అమీర్, నూర్ ముహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.