Andhra
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు మార్కాపురం జడ్పీ బాలుర విద్యార్థి ముండ్ల అభి ఎంపిక ..
మార్కాపురం: స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మార్కాపురం నందు చదువుతున్న యం.అభి జాతీయ స్థాయి అండర్ 17 కబడ్డీ జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు. ఈ విద్యార్థి త్వరలో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కబడ్డీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రకాశం జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జట్టులో ముగ్గురు మన జిల్లా పరిషత్ బాలుర ఉన్నతపాఠశాల విద్యార్థులు ఉండగా వారిలో ముండ్ల అభి జాతీయ కబడ్డీ పోటీలకు అర్హత సాధించడం జరిగింది. వీరికి శిక్షణ ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు డి.శ్యామల దేవి, పి.దామోదర్ రెడ్డి, మరియు కె. ఓబులేసు లను ప్రధానోపాధ్యాయులు ఎమ్ చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లి తండ్రులు అభినందించారు.
![]()
