Andhra
ఏపి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ముహమ్మద్ ఫారూఖ్ షుబ్లి నియామకం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా ముహమ్మద్ ఫారూఖ్ షుబ్లికు నియమితులయ్యారు. ఈయన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఫౌండర్ మరియు అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం హాయంలో ఎంతోమంది BC, మైనారిటీల సమస్యలపై పోరాటం చేశారు. గత ప్రభుత్వం చేపట్టిన కొన్ని ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టుకు వెళ్లి విజయం సాధించారు. ఫారూఖ్ షుబ్లికు ఈ పదవి వరించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా MHPS కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ పదవిని రావడానికి సహాకరించిన గౌరవ సీయం నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, మైనారిటీ శాఖ మంత్రి నశ్యం ఫరూక్, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డిలకు ఫారూఖ్ షుబ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాకు ఇచ్చిన బాధ్యతను పూర్తిగా న్యాయం చేసి, సీయం చంద్రబాబు నాయుడుకు, పార్టీకి మంచి పేరు తీసుకుని వస్తానని చెప్పారు.
![]()
