Andhra
కూటమి ప్రభుత్వం ప్రజలను వంచించడం మాని, వాగ్దానాలు నెరవేర్చాలి..CPI రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీ (CPI) పశ్చిమ ప్రకాశం ప్రాంతీయ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా CPI రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడుతూ.. మార్కాపురం జిల్లాను చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని, ఇప్పుడు కప్పదాటు వ్యవహారంగా ప్రవర్తించడం మంచిది కాదని, అలాగే వెలుగొండ ప్రాజెక్టు గత వైసీపీ ప్రభుత్వం పూర్తి చెయ్యకుండానే చేశామని ప్రజలను వంచించారని చంద్రబాబు, మంత్రులు చెబుతున్నారని, 30 సంవత్సరాలుగా వీళ్లేమి చేశారో ప్రజలకు అర్థం అయిపోతుందని ఎద్దేవా చేశారు. పెట్టుబడులు తీసుకొని తెస్తున్నామని చెప్పడమే కాని, వాస్తవ రూపం దాల్చడం లేదని, దొనకొండను పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పడమే కాని ఇప్పటి వరకు ఒక్కటి అమలులోకి రాలేదని, ప్రజలను మభ్య పరచడం మాని పని చేసి చూపించాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎంఎల్. నారాయణ, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెవి క్రిష్ణ గౌడ్, సీనియర్ నాయకులు అందే నాసరయ్య, నియోజక వర్గ పార్టీ కార్యదర్శి ఎస్ కె కాసిం, పశ్చిమ ప్రకాశం సిపిఐ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
![]()
