Andhra
మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలో రౌండ్ టేబుల్ సమావేశం.
యర్రగొండపాలెం: మార్కాపురం కేంద్రంగా జిల్లా వెంటనే అనౌన్స్ చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్ షేక్ సైదా, కో కన్వీనర్లు సిపిఐ జిల్లా సీనియర్ నాయకులు అందే నాసరయ్య, మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వేశపోగు సుదర్శన్, సిపిఐ జిల్లా నాయకులు డి సోమయ్య, యర్రగొండపాలెం నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ మెడబలిమి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు యర్రగొండపాలెంలోని స్థానిక ఎన్జీవో హోంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్, సిపిఐ సిపిఎం, ఆమ్ ఆద్మీ, బి.ఎస్.పి వి.సి.కె పార్టీలు మరియు ప్రజా సంఘం యంపీజే, స్వచ్ఛంద సంస్థలు రైతు సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యర్రగొండపాలెం నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ మెడబలిమి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా, సిపిఐ సీనియర్ నాయకులు అందే నాసరయ్య, MPJ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్, సిపిఎం నాయకులు సోమయ్య, రైతు సంఘం రాష్ట్ర నాయకులు దేవేండ్ల శ్రీనివాసరావు, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు వేసపోగు సుదర్శన్, సిపిఐ సీనియర్ నాయకులు టిసిహెచ్ చెన్నయ్యలు మాట్లాడుతూ.. చంద్రబాబు ఎన్నికల వాగ్దానంలో భాగంగా మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, ఇటీవలే మంత్రుల సబ్ కమిటీ లో తీర్మానం చేశామని, త్వరలో ప్రకటిస్తామని హడావుడి చేశారని, అయితే ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం సి ఎస్ పురం మండలంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు జిల్లా ఊసే ఎత్తుకోవడం, రెండు సార్లు జిల్లాల మంత్రివర్గ సమావేశం వాయిది వేయడంతో కూటమి ప్రభుత్వ వైఖరిపై పలు అనుమానాలు మాకు, అటు ప్రజలకు తావిస్తోందని అన్నారు. నవంబర్ 15వ తేదీన మార్కాపురంలో మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించామని, ప్రస్తుతం నేడు యర్రగొండపాలెంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, అలాగే 24వ తేదీన మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నామని, అలాగే శ్రీశైలాన్ని కూడా మార్కాపురం జిల్లాలో కలపాలని సమావేశం తీర్మానించింది. అనంతరం వై పాలెం టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబును కలిసి జిల్లా ఆవశ్యకతను వివరించి త్వరగా జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కే వి కృష్ణ గౌడ్, బీఎస్పీ నాయకులు రాచిటి ప్రసాద్, విసికె పార్టీ నాయకులు టి అచ్చయ్య, మాల ఐక్యవేదిక అధ్యక్షులు ఎలిసెల కోటేశ్వరరావు, ఏపీజెఎసి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఆలేటి నాగయ్య, రిటైర్డ్ ఎన్జీవో నాయకులు తాళ్లపల్లి సుబ్బారావు, సిపిఐ నాయకులు బి రామయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు డి బాలకృష్ణారెడ్డి, ఎస్ కె మహబూబ్ వలీ, దళిత ఉద్యమకారుడు కోట డేవిడ్, రైతు సంఘం నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, దళిత నాయకులు మెడబలిమి మౌంట్ బాటన్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గుమ్మా రాజయ్య, బీసీ నాయకులు ముటుకూరి వెంకటేశ్వర్లు, గజ్జ వెంకటేశ్వర్లు, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు తిరుమలయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.
![]()
