Connect with us

Andhra

ప్రపంచ మానవ హక్కుల కమిషన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ గా డాక్టర్ షేక్ మహబూబ్ వలి..

Published

on

మార్కాపురం: ప్రపంచ మానవ హక్కుల కమిషన్ భారతదేశం వైస్ ప్రెసిడెంట్ గా ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ షేక్ మహబూబ్ వలి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు శుక్రవారంన ప్రపంచ మానవ హక్కుల కమిషన్ ప్రపంచ కార్యాలయం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.

ప్రపంచ మానవ హక్కుల కమిషన్ తన సందేశంలో డాక్టర్ షేక్ మహబూబ్ వలికి మానవ హక్కుల కమిషన్ లో జీవితకాల సభ్యత్వము, దేశ ఉపాధ్యక్షుడిగా జీవితకాలం కొనసాగుతారని తెలిపారు. నవంబర్ 27 -2025 న అధికారిక నియామక పాత్రన్ని ఇవ్వనున్నామని తెలిపారు. ఈ సంస్థ ద్వారా డాక్టర్ షేక్ మహబూబ్ వలికి ఒక నేషనల్ అవార్డు రాష్ట్రీయ అశోక్ సన్మానం అవార్డును ప్రధానం చేయనున్నారని పేర్కొన్నారు.

ఈ అవార్డు డాక్టర్ వలి 110వ అవార్డు కావడం విశేషం. డాక్టర్ మహబూబ్ వలి సమాజం కోసం చేస్తున్న సేవలను గుర్తించిన ప్రపంచ మానవుల హక్కుల కమిషన్ ఈ బాధ్యతను ఇస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. ఈ బాధ్యతలను అప్పజెప్పిన ప్రపంచం మానవ హక్కుల కమిషన్ సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. మానవ హక్కులను కాపాడడానికి తన సాయ శక్తుల కృషి చేసి సంస్థ అభివృద్ధి కోసం తోడ్పడతానని తెలిపారు. ఇప్పటికే డాక్టర్ షేక్ మహబూబ్ వలి సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సంస్థ, కరప్షన్ ఫ్రీ ఇండియా, యోగ్దాన్ సహారా సమితి ఈ మూడు సంస్థలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ షేక్ మహబూబ్ వలి నియామకంపై పలువురు మిత్రులు, సన్నిహితులు, ప్రముఖులు మహబూబ్ వలికి శుభాకాంక్షలు తెలిపారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.