Andhra
రేపు మార్కాపురం జిల్లా సాధన సమితి వై పాలెం జేఏసీ సమావేశం..
యర్రగొండపాలెం: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల వాంఛ అయిన మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో 65 రోజులు పాటు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించడం జరిగిన విషయం విదితమే. నాడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి 18 నెలలు గడిచిన ఈనాటికి జిల్లా ఏర్పాటు చేయనందుకు నిరసనగా మరో ఉద్యమం కొనసాగించేందుకు సన్నాహకంగా 21 నవంబర్ 2025 శుక్రవారం ఉదయం 10:00 గంటలకు NGO హోం యర్రగొండపాలెంలో సమావేశం ఏర్పాటు చేయడం చేస్తున్నారు.
ఈ సమావేశానికి మార్కాపురం జిల్లా సాధన సమితి కన్వీనర్, కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు షేక్ సైదా, కో-కన్వినర్లు అందే నాసరయ్య.. సీనియర్ సిపిఐ నాయకులు, షేక్ అబ్దుల్ రజాక్.. యంపీజే రాష్ట్ర అధ్యక్షులు, వి సుదర్శన్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు, డిఎంకె రఫీ, సీఐటీయూ జిల్లా నాయకులు పాల్గొంటున్నారు. కావున మార్కాపురం జిల్లా సాధన కొరకు జరిగే ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మార్కాపురం జిల్లాను కాంక్షించే వాళ్లు మరియు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుతున్నట్లు మార్కాపురం జిల్లా సాధన సమితి యర్రగొండపాలెం నియోజకవర్గ జేఎసి కన్వీనర్ మెడబలిమి వెంకటేశ్వర రావు తెలిపారు.
![]()
