Andhra
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు జడ్పిబిహెచ్ విద్యార్థులు ఆరుగురు ఎంపిక..
మార్కాపురం: ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కంచర్ల వారి పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14, అండర్ 17 కబడ్డీ పోటీలలో మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు.
విద్యార్థులు వి. మహేష్, ఎం. అజయ్ లు అండర్ 14లో ఎం.జస్వంత్ నాయక్, పి.అజయ్, యం.అభి, మరియు డి. రాజశేఖర్ రెడ్డి లు అండర్ 17 కబడ్డీ ప్రకాశం జిల్లా జట్టుకు ఎంపిక అయ్యారు. వీరు రేపు కృష్ణాజిల్లా, మచిలీపట్నం నందు జరగబోవు రాష్ట్రస్థాయి అండర్ 14 విభాగం నందు, కర్నూలు జిల్లా నందు జరగబోవు రాష్ట్రస్థాయి అండర్ 17 బాలుర విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు.
జట్టుకు ఎంపిక అయిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు డి.శ్యామల దేవి, పి.దామోదర్ రెడ్డి మరియు కె. ఓబులేసు లను ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది అభినందించడం జరిగింది.
![]()
