Andhra
కరప్షన్ ఫ్రీ ఇండియా ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ షేక్ మహబూబ్ వలి..
మార్కాపురం: కరప్షన్ ఫ్రీ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా సమాజ సేవకులు డాక్టర్ షేక్ మహబూబ్ వలీ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు కరప్షన్ ఫ్రీ ఇండియా సంస్థ జాతీయ అధ్యక్షులు జనబ్ ఆఫ్తాబ్ అన్సారి అపోలో, కరప్షన్ ఫ్రీ ఇండియా సంస్థ భారతదేశ ప్రధాన కార్యదర్శి జనబ్ సయ్యద్ ముదస్సిర్ పీర్ ఖాద్రి ఈ విషయాన్ని అధికారికంగా సంస్థ నుండి అయనకు ఉత్తర్వులు పంపారు. కరప్షన్ ఫ్రీ ఇండియా సంస్థ జాతీయ అధ్యక్షులు జనబ్ ఆఫ్తాబ్ అన్సారి అపోలో మాట్లాడుతూ.. మహబూబ్ వలి నేతృత్వంలో కరప్షన్ ఫ్రీ ఇండియా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుగా ఉండి వారికి న్యాయం చేస్తారని అభిలసిస్తున్నామన్నారు.
డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన అవినీతి రహిత భారత దేశ సంస్ధ రాష్ట్ర అధ్యక్షులు జనబ్ ఆఫ్తాబ్ అన్సారి అపోలో, సయ్యద్ ముదస్సిర్ పీర్ ఖాద్రి లకు కృతజ్ఞతలు తెిపారు. రాష్ట్రంలో జరిగే అవినీతిపై ప్రజల గొంతుగా ఉంటానని తెలిపారు. డాక్టర్ షేక్ మహబూబ్ వలి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శిగా, యోగ్దాన్ సహారా సమితి, సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఈ నియామకంపై డాక్టర్ షేక్ మహబూబ్ వలికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
![]()
