Connect with us

Andhra

వృద్ధ దంపతుల సంక్షేమo మనందరి బాధ్యత.. న్యాయవాది మొగల్ అన్వర్ బేగ్

Published

on

మార్కాపురం: వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంక్షేమం మన అందరి బాధ్యత అని మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ పానెల్ న్యాయవాది మొగల్ అన్వర్ బేగ్ అన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ ఎం శుభవాని ఆదేశాల మేరకు సోమవారం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ పరిధిలోనీ అల్లూరి పోలేరమ్మ దేవస్థానం సమీపంలో ఉన్న హోంగార్డు కాలనీ నందు నివాసం ఉంటున్నా కాలనీ వాసులకు వెల్ఫేర్ చట్టం-2007 పై మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ చట్టం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకులు / కుమార్తెలకు చట్ట పరంగా శిక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అమ్మా నాన్నల చేతిలో సంక్షేమ చట్టం ఓ రక్షణ కవచంలో ఉంటుందని వివరించారు. వృద్ధ దంపతులు ప్రతి ఒక్కరు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎన్జీవో అనీల్ రాజు, లీగల్ సర్వీసెస్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.