Andhra
విజయవాడలో మావోయిస్టుల కలకలం.. ఏపీలో 31 మంది అరెస్టు..
ఏపి: ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని విజయవాడలో మావోయిస్టుల కదలికలు రాష్ట్రవ్యాప్తంగా కలవరం రేకెత్తించాయి. నిఘా సమాచారం ఆధారిత ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ముఖ్యంగా ఆక్టోపస్ (ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్స్) ఎలైట్ కమాండో టీమ్.. ముమ్మరంగా
విజయవాడలోని కనూరు, పెనమలూరు ప్రాంతాల్లో మావోయిస్టులు మకాం వేసినట్టు సమాచారం అందడంతో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడ దాడులు చేశాయి. ఈ ఆపరేషన్‌లో ఆరుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఆరుగురు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో మావోయిస్టుల పెద్ద నాయకులు ఉన్నట్లు సమాచారం. అందిరిని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించి కఠిన విచారణ చేపట్టారు. ఇప్పటికే మారెడుపల్లిలో మావోయిస్టు అగ్రనేత ఎన్కౌంటర్, కాకినాడలో కొందరి అరెస్టులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అరెస్టైన వారు భారీ డంప్ని ఎక్కడో దాచి ఉంటారనే అనుమానాల మధ్య విచారణ జరుగుతోంది.
![]()
