Andhra
ఏటికి ముంచుకొస్తున్న ముంధా తుఫాన్..
నేటి నుంచి నాలుగు రోజులు ఏపీకి రెయిన్ టెర్రర్!.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. తర్వాత తీవ్ర వాయుగుండంగా, తుఫానుగా బలపడబోతోంది. దీనికి మొంథా తుఫానుగా నామకరణం చేసింది IMD. అంతేకాకుండా పలు ప్రాంతాల్లోని స్కూళ్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఏపీపైకి మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న వాయుగుండంగా బలపడింది. కాకినాడకు 920కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం.. పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి ఇవాళ తీవ్ర నాయుగుండం రూపాంతరం చెందబోతోంది.
సోమవారం తుఫాన్గా.. మంగళవారం తీవ్ర తుఫాన్గా మారి విరుచుకుపడే అవకాశం ఉంది. ఇక.. మంగళవారం సాయంత్రానికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
కాగా.. మొంథా తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని ఉత్తర-దక్షిణ కోస్తా జిల్లాల్లో నాలుగు రోజులపాటు భారీ పర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో రేపు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో ఆరెంజ్ ఆలర్ట్ జారీ ఇచ్చింది. అల్లూరి, ఏలూరు, ఎన్టీయార్, కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి.
![]()
