Connect with us

Andhra

తుఫాన్ ముందస్తు చర్యలను సమిక్షించిన అధికారులు..

Published

on

మార్కాపురం: ప్రకాశం జిల్లా కలెక్టర్ తుఫాన్ తాలూకు మార్కాపురం మండల ప్రత్యేక అధికారిగా మార్కాపురం PSVP స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ M. వెంకట సత్యనారాయణను నియమించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి సత్యనారాయణ మండల/మునిసిపల్ అధికారులుతో తహసీల్దార్ వారి కార్యలయంలో సమావేశం ఏర్పాటు చేసి ముందస్తు చర్యల వివరాలు తెలుసుకున్నారు. మొంధ తుఫాను రానున్న సందర్బంగా అధిక వర్షాలు పడే నేపథ్యములో ప్రజలను అప్రమత్తం చేయాలని, ఎలాంటి ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసందర్భంగా కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో ఈ పాటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఎక్కడైనా ఏదైనా విపత్తు సంభవించినచో వెంటనే తెలియజేయాలనీ ప్రజలను కోరారు. సచివాలయ సిబ్బంది అలాగే మండల ఆధికారులు అందరూ హెడక్వార్టర్ లో ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా ఇరిగేషన్ & విద్యుత్ అధికారులు ముందస్తు చర్యలలో భాగంగా చురుకుగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో తహసీల్దార్ చిరంజీవి, మునిసిపల్ కమీషనర్ నారాయణ రావు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.