Connect with us

Andhra

తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి..జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా డిమాండ్

Published

on

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో తుఫాను ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షాల వలన నీట మునిగిన పంటల రైతులను ఆదుకోవాలని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా డిమాండ్ చేశారు. జిల్లాలో పశ్చిమ ప్రకాశంతో పాటు మొత్తంగా జిల్లాలోని 19 మండలాలలో అధిక నష్టం జరిగిందని అన్నారు. ముఖ్యంగా పత్తి, సజ్జ, జొన్న, వేరుశనగ, వరి, పొగాకు, కూరగాయల పంటలు, మొక్కజొన్న, మిరప తదితర పంటలు నీట మునగడంతో రైతులు భారీగా నష్టపోయారని ఆవేదన వ్యక్తపరిచారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి వేసిన పంటలు చేతికొచ్చే దశలో ప్రకృతి వైపరిత్యాలకు పంటలు నీట మునగడంతో రైతులు లబోదిబో మంటున్నారని, జిల్లా వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టానికి పరిహారం అందజేయాలని కోరారు. జిల్లాలో దాదాపు 12, వేల హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని, వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన పంటలను అంచనా వేసి ప్రభుత్వానికి వెంటనే నివేదిక అందించాలని తద్వారా వివిధ పంటల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని షేక్ సైదా కోరారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.