Andhra
రూ.15,780 కోట్ల భారం మోపి.. 923 కోట్లే తగ్గిస్తారా.. వైయస్ షర్మిలా రెడ్డి ఫైర్
విజయవాడ: గోరంత చేసి కొండంతలుగా చెప్పుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటే. కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత 15 నెలల్లో ప్రజలపై రూ.15,780 కోట్ల ట్రూఅప్ భారాన్ని మోపారు. ఇప్పుడు ట్రూడౌన్ తో తగ్గిన భారం రూ.923 కోట్లు మాత్రమే. 2024-25లో సర్దుబాటు పేరిట అదనంగా దోచిన రూ.923 కోట్లను ఈఆర్సీ మందలించడంతో తిరిగి చెల్లించారు. అయితే, అది కూటమి ప్రభుత్వం వచ్చాక తగ్గించిన మొత్తంగా చంద్రబాబు డబ్బాకొట్టుకోవడం, సమర్థత, అనుభవం వంటి మాటలు చెప్పుకోవడం సిగ్గు చేటని పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి పేర్కొన్నారు.
![]()
