Connect with us

Andhra

రేబీస్ ప్రాణాంతకమైన వైరల్ వ్యాధి: డాక్టర్ నజీరుద్దీన్

Published

on

Shot News:నేడు ప్రపంచ రేబీస్ దినోత్సవం కాబట్టి ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా, అవగాహన పెంచుకొని ఉండాలని గుంటూరు లోని హాప్ విన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ షేక్ నజీరుద్దీన్ అన్నారు.రేబీస్ (Rabies) అంటే ప్రాణాంతకమైన వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా జంతువులనుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా కుక్కలు, నక్కలు, గబ్బిలాలు వంటి జంతువుల కాటు, గీతలు లేదా నోటి లాలాజలం (saliva) ద్వారా ఈ వైరస్ వస్తుంది.ఈ వ్యాధి సోకి చనిపోయిన వారిని సోషల్ మీడియాలో చూశామని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.ఈ వ్యాధి సోకితే మొదట జ్వరం, తలనొప్పి, అలసట, కాటు దగ్గర నొప్పి, గరగరలు,తరువాత నీటి భయం (Hydrophobia), ఆందోళన, పరిగెత్తడం/తంటాలు తప్పదు అని, వెంటనే చికిత్స ప్రారంభించాలని చికిత్స లేకపోతే మరణం తప్పదు కాబట్టి నివారణ కోసంకుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు సమయానికి రేబీస్ వ్యాక్సిన్ వేయాలి అని,అనుమానాస్పద జంతువు కరిస్తే వెంటనే గాయాన్ని 15 నిమిషాలు సబ్బుతో కడిగి, వెంటనే వైద్యుని సంప్రదించి వ్యాక్సిన్ తీసుకోవాలి అని ఆయన తెలియజేశారు.మానవులకు కూడా పోస్ట్-ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ (PEP) అనే వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.