Connect with us

Andhra

సిపిఐ జాతీయ సమితి సభ్యులుగా ఏపీ నుండి 8 మంది ఎన్నిక..

Published

on

చంఢీగర్: ఈ నెల 21 నుండి 25 వరకు చంఢీగర్ లో జరుగుతున్న సీపీఐ 25 వ జాతీయ మహాసభలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా నూతన జాతీయ సమితిను ప్రతిపాదించగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

ఇందులో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుండి జాతీయ సమితి సభ్యులుగా కె రామకృష్ణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి, అక్కినేని వనజ, తాటిపాక మధు, జి ఈశ్వరయ్య, పి హరినాథ్ రెడ్డి, రావులపల్లి రవీంద్రనాథ్ మరియు సెంట్రల్ కంట్రోల్ కమిటీ సభ్యులుగా పి దుర్గాభవాని ఎన్నికయ్యారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.