Connect with us

Andhra

గాజా పౌరులపై ఇజ్రాయెల్ భీకర దాడి.. తాజాగా 47 మంది మృతి

Published

on

గాజా: ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ చేస్తున్న నరమేధాన్ని ఖండిస్తున్న.. అమెరికా వత్తాసుతో గాజాపై ఇజ్రాయెల్ ఎడతెరపీ లేకుండా దాడులకు పాల్పడుతున్నది. ఇప్పటికే గాజా చుట్టూ ప్రక్కల నరమేధం సృష్టించి, జనావాసాలను నాశనం చేసి, ఇప్పుడు గాజా సిటీపై ఎడతెరిపి లేకుండా బాంబు దాడులతో దాడి చేయడంతో మొత్తం సర్వనాశనం అయిపోయింది. అక్కడి ప్రజలు ఆహారం, మందుల కొరతతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇలాంటి పరిసథితుల్లో తాజాగా జరిపిన దాడుల్లో పిల్లలు, స్త్రీలతో సహా సుమారుగా 47 పాలస్తీయన్లు మరణించారు. ఈ దాడులు ఇంకా పెరుగుతాయని, నరక ద్వారాలు తెలుపబడ్డాయని గాజా నగరంలో ఉన్న ప్రజలు ఈ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఇలా ఉండగా సైన్యంలో చేరేందుకు ఆదేశ యువత ఆసక్తి చూపడం లేదు. ఇజ్రాయెల్ లో ఉన్న ప్రతి యువకుడు పదేళ్లపాటు సైన్యంలో రిజర్విస్టుగా పనిచేయాలనే నిబంధన ఉన్నా గాజా యుద్ధం రాజకీయ లక్ష్యాలను సాధించడానికి జరుగుతోందని, హమాస్ను నావనం చేయడానికి కాదని ఇజ్రాయెల్ పౌరులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు టెల్ అవీవ్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారింది. ప్రపంచానికి ఇది మాయని మచ్చగా మిగలనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Loading

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © 2025. Shot News.