Andhra
జిల్లా హాస్పిటల్ ప్రాంగణంలో పాముల కలకలం..
మార్కాపురం: ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం పాముల సంచారంతో ప్రజలు, రోగులు బెంబేలెత్తిపోయారు. రెండు పాములు పెనవేసుకుని ఆడుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పాములను బంధించారు. ఆ సమయంలోనే మరో పాము ఆ ప్రాంతంలో కనిపించింది. స్నేక్ క్యాచర్ నిరంజన్ మూడు పాములను బంధించి స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెడుతున్నట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు పాములను బంధించడంతో ఆసుపత్రికి వస్తున్న రోగులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
![]()
